Twomuch with Kajol and Twinkle Khanna | బాలీవుడ్ అగ్ర తారలు కాజోల్, ట్వింకిల్ ఖన్నా ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరూ కలిసి ప్రైమ్ వీడియోలో ఒక కొత్త టాక్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించబోతున్నారు. “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” పేరుతో రానున్న ఈ టాక్ షో… కాఫీ విత్ కరణ్, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో లాగానే భారతదేశంలోని ప్రముఖ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయనుంది. మరోవైపు ఈ షోకి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ అతిథులుగా రానున్నారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ టాక్ షో రాబోతుండగా.. తాజాగా ఈ షో స్ట్రీమింగ్ తేదీని ప్రైమ్ ప్రకటించింది. ఈ షోని సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Things are about to get a bit Two Much ✨#TwoMuchOnPrime, New Talk Show, Sept 25@Banijayasia @PrimeVideoIN @mrsfunnybones @deepak30000 @NegiR @BalanGirish @jahnvio #MrinaliniJain #ShyamRathi pic.twitter.com/gb97H2baII
— Kajol (@itsKajolD) September 10, 2025