న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 : తయారీదారుల వద్ద ఉన్న పాత స్టాక్‌కు గరిష్ఠ రిటైల్ ధరను సవరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో కొనుగోలుదారులు కొత్త స్టాక్ వచ్చేంత వరకు వేచి చూడకుండా, పాత స్టాక్‌కు మారిన ధరతో కొనుగోలు చేయడానికి వీలుంటుంది.
దీంతో కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనం కలుగనున్నది. జీఎస్టీ రేట్లను రెండింటికి కుదించిన నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వస్తువులపై జీఎస్టీ తగ్గే అవకాశాలు ఉండటంతో వీటి వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించనున్నారు. ఈ నెల 22 నుంచి మారిన జీఎస్టీ స్లాబుల ప్రకారం కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.