మధిర, సెప్టెంబర్ 10 : మధిర మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ క్రాస్ రోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఎం నాయకులు మడుపల్లి గోపాల్ రావు, సీపీఐ నాయకుడు బెజవాడ రవిబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నైజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన మహా యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెంగళ ఆనందరావు, నరసింహారావు, పెరుమలపల్లి ప్రకాష్ రావు, నరసింహారావు పాల్గొన్నారు.