e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News మారుతి సుజుకికి షాక్‌: డీఆర్ఐ ప‌న్ను ఎగ‌వేత నోటీసులు

మారుతి సుజుకికి షాక్‌: డీఆర్ఐ ప‌న్ను ఎగ‌వేత నోటీసులు

మారుతి సుజుకికి షాక్‌: డీఆర్ఐ ప‌న్ను ఎగ‌వేత నోటీసులు

న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అతిపెద్ద ప్ర‌యాణికుల కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి (ఎంఎస్ఐ)కి డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నోటీసు అందించింది. ఆ సంస్థ త‌యారు చేసే సియాజ్‌, ఎర్టిగా, ఎస్‌-క్రాస్ మోడ‌ల్ కార్ల‌లో హైబ్రీడ్ టెక్నాల‌జీ వాడ‌కం సంశ‌యాత్మ‌కంగా మారింద‌ని, దీంతో మారుతి సుజుకి రూ.71 కోట్ల మేర‌కు డ్యూటీని ఎగ‌వేసింద‌ని డీఆర్ఐ అభియోగం.

ఈ మేర‌కు మారుతి సుజుకికి డీఆర్ఐ 105 పేజీల నోటీస్ జారీ చేసింది. మ‌రో నోటీసులో దాదాపు మ‌రో రూ.70 కోట్ల మేర‌కు ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డిన‌ట్లు డీఆర్ఐ అభియోగం. దీనిపై స్పందించ‌డానికి మారుతి సుజుకి అధికార ప్ర‌తినిధి నిరాక‌రించారు.

ఈ అంశం వివాదాస్ప‌దంగా మారింద‌ని మారుతి సుజుకి అధికారి ప్ర‌తినిధి పేర్కొన్నారు. ప్ర‌స్తుత ద‌శ‌లో ఏ వ్యాఖ్య‌లు చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. దీ‌నిపై త‌మ‌కు అందుబాటులో ఉన్న చ‌ట్ట‌ప‌ర‌మైన‌, న్యాయ‌ప‌ర‌మైన ఆప్ష‌న్ల‌ను ఉప‌యోగించుకుంటామ‌ని తెలిపారు.

2019లో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారంపై మారుతి త‌న కొన్ని మోడ‌ల్ కార్ల ఇంజిన్ల‌‌లో స్మార్ట్ హైబ్రీడ్ వెహిక‌ల్ ఫ్రం సుజుకి (ఎస్హెచ్‌వీఎస్‌) టెక్నాల‌జీని వాడిన త‌ర్వాత డీఆర్ఐ అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇది పూర్తిగా హైబ్రీడ్ టెక్నాల‌జీ కాద‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు వాదించాయి.

హైబ్రీడ్ టెక్నాల‌జీ కార్ల త‌యారీలో టెక్నాల‌జీని ఉప‌యోగించిన కార్ల త‌యారీ సంస్థ‌ల‌కు స‌ద‌రు టెక్నాల‌జీ వాడకంపై 2017లో కేంద్ర ప్ర‌భుత్వం క‌స్ట‌మ్స్ డ్యూటీని మిన‌హాయిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ది.

బ్యాట‌రీ ప‌వ‌ర్డ్ ఎల‌క్ట్రిక్ మోటార్ కాంబినేష‌న్‌తో కూడిన ఇంట‌ర్న‌ల్ కంబుష్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ).. కారుకు ఇంధ‌నం అందిస్తుంది. అయితే, మైక్రో-హైబ్రీడ్ మోటార్ వెహిక‌ల్‌లో స్టార్ట్ అండ్ టెక్నాల‌జీని వాడొద్ద‌ని, కేవ‌లం బ్యాట‌రీ ప‌వ‌ర్డ్ ఎల‌క్ట్రిక్ మోటారులో మాత్ర‌మే వినియోగించాల‌న్న‌ది నిబంధ‌న‌.

అయితే, సింపుల్ కారు ఆల్ట‌ర్నేట‌ర్ లేదా ఎంజీయూను దిగుమ‌తి చేసుకుని సాఫ్ట్‌వేర్ సాయంతో క‌స్ట‌మ్స్ క్లియ‌రెన్స్ కోసం దాన్ని హైబ్రీడ్ మోటార్ వెహిక‌ల్స్ గూడ్స్‌గా అభివ‌ర్ణించింది మారుతి సుజుకి అని అభియోగం. త‌దుప‌రి మారుతి సుజుకి త‌న క‌స్ట‌మ‌ర్ల‌ను స‌ద‌రు ప‌రిక‌రం ఎస్‌హెచ్‌వీఎస్ అని న‌మ్మించి మోసం చేసింద‌ని ద‌ర్యాప్తు సంస్థ‌ల ఆరోప‌ణ‌.

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

ఇవి కూడా చదవండి..

ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్‌ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?

డ్రైవింగ్‌ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ

ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్‌

లైవ్‌లో రిపోర్టర్‌ మైక్రోఫోన్‌ ఎత్తుకెళ్లిన కుక్క

లాక్‌డౌన్‌ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి

అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

షోఫియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

ఆర్మీ బలోపేతం వెనుక జనరల్‌ మానెక్‌షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు

రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మారుతి సుజుకికి షాక్‌: డీఆర్ఐ ప‌న్ను ఎగ‌వేత నోటీసులు

ట్రెండింగ్‌

Advertisement