DGP Ravi Gupta | ప్రశాంతంగా పోలింగ్.. పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్.. డీజీపీ రవిగుప్తా..!
DGP Ravi Gupta | తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి విశేష కృషి చేసిన పోలీసుల సేవలకు హ్యాట్సాప్ చెబుతున్నట్లు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా చెప్పారు.
DGP Ravi Gupta | తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసుల విశేషకృషి దాగి ఉందని, ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి.. పోలింగ్ వరకూ ప్రతి ఒక్కరూ చిత్త శుద్ధితో విధులు నిర్వర్తించారని, వారి సేవలకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ సజావుగా, శాంతియుతంగా జరిగినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు.
మావోయిస్టు ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల వల్ల ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోలేదని, సాయంత్రం నాలుగు గంటలకే మావోయిస్టు ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎన్నికల ప్రారంభమైన దగ్గర్నుంచి.. చివరి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌కు చేరేవరకూ డీజీపీ ఆఫీసులోని కట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించినట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికలు ముగిసే వరకూ మొత్తం స్వాధీన సొత్తు విలువ రూ.191కోట్లకు చేరిందని డీజీపీ తెలిపారు. వీటిల్లో నగదు 98.82 కోట్ల వరకు పట్టుబడిందన్నారు. రూ 10.81 కోట్ల విలువైన మద్యం, రూ.7.11 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.62.77 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.11.65 కోట్ల విలువైన ఉచితాలతో కలిపి మొత్తం రూ.191.16 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క దుర్ఘటన కూడా జరగకుండా బందోబస్తు నిర్వహించిన హోంగార్డు నుంచి ఏడీజీ స్థాయి అధికారి వరకూ అందరికీ డీజీపీ రవిగుప్తా కృతజ్ఞతలు తెలిపారు. వారి బందోబస్తుకు సహరించిన పోలీసు కుటుంబాలను కూడా డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ ఆఫీసర్స్ ఏడీజీలు సంజయ్‌కుమార్ జైన్, మహేశ్ భగవత్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

