Vote Missing | సార్వత్రిక ఎన్నికల వేళ కొందరు ఓటర్ల పేర్లు మాయం అవుతుంటాయి. సాధారణ ఓటర్ల పేర్లు మిస్ అవుతున్నాయంటే చాలా మామూలు విషయం. కానీ, భారత వైమానిక దళం మాజీ అధిపతి ప్రదీప్ వసంత్ భార్య ఓటు గల్లంతైన సంగతి మహారాష్ట్రలోని పుణెలో సోమవారం వెలుగు చూసింది.
లోక్ సభ ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్ సందర్భంగా సోమవారం పుణెలోని సాప్లింగ్ స్కూల్ బ్యానర్ లోని పోలింగ్ బూత్-26కు భారతీయ వాయుసేన మాజీ అధిపతి ప్రదీప్ వసంత్ నాయక్, తన భార్య మధుబాల, కుమారుడు వినీత్ తో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. కానీ ఆయన భార్య పేరు ఓటర్ జాబితాలో కనిపించలేదు.
ఈ విషయాన్ని అక్కడి అధికారి దృష్టికి తెచ్చినా ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని నాయక్ చెప్పారు. ‘మేం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన పోలింగ్ స్లిప్లు మా వద్ద ఉన్నాయి. కానీ నా భార్య పేరు లేదు’ అని ప్రదీప్ వసంత్ నాయక్ వాపోయారు.