Sajjala | ప్రభుత్వ సానుకూలతతో పోటెత్తిన ఓటర్లు.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య..!
Sajjala | పేద వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sajjala | పేద వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం పట్ల సానుకూలతతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఉప్పెనలా పోటెత్తారని సోమవారం మీడియాతో చెప్పారు. ముందుగానే రాష్ట్ర ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు. ‘ప్రజలు ఓటేసేందుకు వెల్లువెత్తారు. ఎన్నడూ లేని విధంగా సానుకూల ఓటుతో బారులు తీరారు. పోలింగ్ బూత్‌ల వద్ద క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారు’ అని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో ఉదయం టీడీపీ నేతలే కత్తిపోట్లకు పాల్పడ్డారని, టీడీపీ కార్యకర్తలే రెచ్చిపోయి దాడులు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిల్లో హింసాకాండకు దిగారన్నారు. టీడీపీ మూకలు రిగ్గింగ్ కు పాల్పడటంతోపాటు ఈవీఎంలు ధ్వంసం చేశారన్నారు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించారన్నారు. పేదల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుందన్నారు. కేంద్రం అండతో పోలింగ్ తేదీ వరకూ టీడీపీ నాటకాలాడటంతోపాటు దాడులకు పాల్పడిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేశారని, టీడీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

