Rains | ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘాట్కోపర్, బాంద్రాకుర్లా, ధారావి ప్రాంతాల్లో భారీ వర్సం కురిసింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబయి కాగా.. ఈదురుగాలులు, భారీ వర్షంతో విమానరాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ సాయంత్రం 5 గంటల తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.
Mumbai is the best place for Dune 3 rn 🤣🤭#MumbaiRains pic.twitter.com/l5oPfCko6C
— Anjali Tanna (@fuzzieandsassy) May 13, 2024
వర్షం కారణంగా 15 విమానాలను దారి మళ్లించారు. ఘాట్కోపర్లోని చెద్దానగర్ జంక్షన్లో వంద అడుగుల బిల్ బోర్డు కూలిపోయి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌పై పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 67 మంది వరకు గాయపడ్డారు. బిల్ బోర్డు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. పాల్ఘర్, థానే జిల్లాల్లో రానున్న మూడునాలుగు గంటల్లో.. 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరించింది. భారీ గాలులు, వర్షాల కారణంగా ఆరే – అంధేరీ ఈస్ట్ మెట్రోస్టేషన్ల మధ్య రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ముంబైలో ధూళి తుఫాను బీభత్సం
ధూళి తుఫాను ధాటికి రోడ్డుపై కూలిపోయిన పరంజా pic.twitter.com/kap6yqXGhx
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024