Telangana Elections | తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సంగాయిపేట తండా ప్రజలు దేశ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో వందశాతం పోలింగ్ రికార్డైంది. ఈ తండాలో 210 ఓట్లు, అందులో 95 మంది పురుషులు, 115 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వంద శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల జిల్లా కలెక్టర్.. సంబంధిత సంగాయి తండా ప్రజలను అభినందించారు.