అలంపూర్ చౌరస్తా, ఆగస్టు 30 : రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తోటి ఎమ్మెల్యేలతో కలిసి సెక్రటరియేట్ ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరై రైతుల ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నివాళులర్పించారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విజయుడు పాల్గొన్నారు.