మక్తల్, ఆగస్టు 29 : వానకాలం సీజన్లో వరి పంట సాగు చేసుకున్న రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితి ఎదురైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. యూరియా సంచుల కో సం శు క్రవారం తెల్లవారు జామున మూడు గం టలకే రైతులు పీఏసీసీఎస్ చేరుకొని క్యూలో ఉంటే రైతుకు రెండే యూ రియా బస్తాలు ఇవ్వడం ఏంటని వ్యవసాయాధికారి మిథున్ చ్ర కవర్తిని ఆయన ప్రశ్నించా రు.
శుక్రవారం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిల్చున్న రైతులకు వద్దకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వారి వివరాలు తెలుసుకున్నారు. అయి తే రైతుల తెల్లవా రు జాము న మూడు, నాలుగు గంటలకు వచ్చి పాసు బుక్కులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నామని మాజీ ఎ మ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆ యన కాంగ్రెస్ ప్రభు త్వం రైతులకు యూరియా అందించడం లో ఘోరంగా విఫలమైందని, కేంద్రం కూడా రై తుల ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మక్తల్‌కు చెందిన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నా నియోజకవర్గ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదన్నారు. రైతులు తెల్లవారు జాము నుంచి పడిగాపులు కాస్తున్నా వారికి వ్యవసాయాధికారులు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూ రియా అందించాలని లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆం దోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెం ట మాజీ ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్నహనుమంతు, నాయకులు గాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, బెల్లం శ్రీనివాస్, వెంకటప్ప తదితరులు ఉన్నారు.