మరికల్, ఆగస్టు 29 : మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో వందేండ్ల కిందట ఇండ్లు కట్టుకున్నారని, దేవాదాయ శాఖవారు ఈ భూములు మావీ మీరు ఖాళీ చేసి వెళ్లాలని గ్రామస్తులకు కోర్డు నుంచి నోటీసులు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి దేవాదాయశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 లో దేవాదాయ శాఖ వారు 11 మందికి నోటీసులు ఇవ్వగా మళ్లీ ఈనెల 7న 25 మందికి నోటీసులు ఇవ్వడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తాతల కాలం నుంచి ఇండ్ల నిర్మాణం చేసుకొని జీవిస్తున్నామని చెప్పారు.
దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఆలయం భూములు పల్లెగడ్డలో ఉన్నాయని, వాటిలోనే గ్రామస్తులు ఇండ్లు నిర్మాణం చేసుకున్నారని దేవాదాయశాఖ వారు గ్రామస్తులకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మండలంలోని పల్లెగడ్డలో పర్యటించగా గ్రామస్తులు దేవాదాయ శాఖ వారు ఇచ్చిన నోటీసుల విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ వరకు వందేండ్ల నుంచి ఏమి చేశారని ప్రశ్నించారు. నోటీసులపై గ్రామస్తులు అధైర్యపడొద్దని, మీ అండగా ఉంటానని, న్యాయం గెలుస్తుందని భరోసా ఇచ్చారు.
గతంలో నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న హరిచందనతో మాట్లాడి కొంత భూమిని గ్రామ కంఠం భూమిగా మార్చాలని కోరగా ఆమె నివేదికను తయా రు చేసి దేవాదాయ శాఖ వారికి పంపించడం జరిగిందని గుర్తు చేశారు. ఎవరూ ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని, కోర్టు ఖర్చులు కూడా నేను భరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట జెడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు లంబా డి తిరుపతయ్య, సీనియర్ నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, సంపత్‌కుమార్, కార్యదర్శి కృష్ణారెడ్డి, విష్ణుకాంత్‌రెడ్డి, మురళి, హన్మంతు, వీరబసంత్, రామస్వామి, నారాయణ, శ్రీనివాసులు, మతీన్, సత్యారెడ్డి, శ్రీనివాసులు, నర్సింహులు, బాలకిష్టారెడ్డి, విష్ణు, హుస్సే న్, కొయిలకొండ రఘు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, ఆగస్టు 29 : నారాయణపేటలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్, యువ మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మ హ్మద్ అబ్దుల్ ఖదీర్, గులాం రసూల్తాజ్, మహ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ రహీం తదితరులు బీఆర్ఎస్లో పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు మహిమూద్, సీనియర్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.