KTR | ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత వస్తే మీకు హక్కు వస్తది.. ప్రైవేట్ మెంబర్ బిల్లుపై కేటీఆర్
KTR | మొన్న రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లు నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటాము అని చెప్పినట్లు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే మీకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుండి మీ బ్యాంకు ఖాతాల్లో పడతాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్‌తో కూర్చొని మేమొక ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారు చేశామని.. ఈ బిల్లును రాష్ట్ర శాసన సభ, శాసనమండలిలో వచ్చే శుక్రవారం ప్రవేశపెట్టబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తూ వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ మేం ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నామన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే ఏం జరగుతుందని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. మొన్న రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లు నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటాము అని చెప్పినట్లు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే మీకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుండి మీ బ్యాంకు ఖాతాల్లో పడతాయన్నారు. మీకు కూడా రూ.2500 కోసం ఎదురుచూసే అవసరం ఉండదు. చట్టమైతే, కాంగ్రెస్, బీజేపీ సహకరిస్తే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాసైతే.. మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు ప్రభుత్వం రూ.2500 ఇయ్యాల్సిందే. లేకపోతే ఖాతాల నుంచి కట్ చేసుకునే ఆటోడెబిట్ సౌకర్యం తప్పకుండా మీకొస్తది. మీ ఖాతాల్లో వచ్చి పడ్తది. లేదంటే బాకీగా మిగిలిపోతది.. మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తదన్నారు కేటీఆర్.
చట్ట బద్దత వస్తే మీకు హక్కు వస్తది..
రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ రూ.4000 పెన్షన్‌కు సంబంధించి చట్ట బద్దత వస్తే మీకు హక్కు వస్తదన్నారు కేటీఆర్. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి చట్టం ఉంది..వీళ్లు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలు వేసి గవర్నమెంట్‌తో మిత్తితో సహా కట్టించి ఇస్తది.. గది మీకు లాభమయ్యేదన్నారు. రైతులకు హక్కు వస్తది.. ఆరు గ్యారంటీ చట్టమైతే రైతులకు హక్కు వస్తది. మాకు 15000 అన్నడు.. ఇస్తలేడు. ఇప్పటికే మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలు వేసి గవర్నమెంట్తోని మీకు పైసలిప్పస్తది.
రాష్ట్రంలోని విద్యార్థులకు లాభమైతది.5 లక్షల మంది విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్‌కు ఏర్పడతది. అందుకే మేం మీ తరపున ఈ బిల్లు పెడుతున్నం. మీరు దరఖాస్తుల్లివ్వాల్సిన అవసరముండదు. దండాలు పెట్టాల్సిన పని లేదు. అయ్యా అప్పా అని ఎవరినీ బతిమిలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎట్లైతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలిస్తదో చట్టం చేస్తే అట్లాగే రూ.4వేల పెన్షన్, మీకు రూ.2500 మహిళలకు, రూ.15 వేలు రైతులకు, 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకు వస్తది. చట్టం ఉద్దేశం ఇదని స్పష్టం చేశారు.
Read Also :
బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

