బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
బీఆర్ఎస్ పార్టీతోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
దేవరకొండ, మార్చి 21 : బీఆర్ఎస్ పార్టీతోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ అవసరమైన నిధులను మంజూరు చేసిందన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ కు రంజాన్ పర్వదినం ప్రతీక అన్నారు.
మైనారిటీల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, నేటికీ గుణాత్మక ఫలితాలనిస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలంతా భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిల్యా నాయక్, కిషన్ నాయక్, టీవీఎన్ రెడ్డి, జానీ బాబా, నీలా రవి కుమార్, హరిలాల్, రూప్లే నాయక్, అంజి గౌడ్, ముత్యాల రవి, మధు, మురళి, వాజీద్ పాషా, రాజు, కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

