Yoga Asanas For Digestive Health | ఈ యోగాసనాలను తరచూ వేస్తుంటే చాలు.. ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు..
జీర్ణ సమస్యలైన ఉబ్బరం, మలబద్ధకం, నెమ్మదిగా పనిచేసే మెటాబాలిజం ఇవన్నీ ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారుతున్నాయి. కూర్చుని పని చేసే జీవనశైలిని కలిగి ఉండడం, ఒత్తిడి, అసమయ భోజనం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటివి ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
Yoga Asanas For Digestive Health | జీర్ణ సమస్యలైన ఉబ్బరం, మలబద్ధకం, నెమ్మదిగా పనిచేసే మెటాబాలిజం ఇవన్నీ ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారుతున్నాయి. కూర్చుని పని చేసే జీవనశైలిని కలిగి ఉండడం, ఒత్తిడి, అసమయ భోజనం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటివి ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా మంది తీసుకునే ఆహారం జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ, కొన్ని యోగాసనాలు కూడా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. యోగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పొత్తికడుపు అవయవాలను ఉత్తేజితం చేస్తుంది. గట్-బ్రెయిన్ కనెక్షన్‌ను సమతుల్యం చేస్తుంది. నిరంతరం యోగా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు గ్యాస్ సమస్య తగ్గుతుంది. మొత్తం పొట్ట ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పవనముక్తాసనం, భుజంగాసనం..
జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యోగాసనాలల్లో పవనముక్తాసనం ఒకటి. ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్ తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం. ముందుగా మెత్తపై పడుకోవాలి. ఒక మోకాలు ఛాతీ వైపు తీసుకురావాలి. రెండు చేతులతో పట్టుకుని పొత్తికడుపుకు దగ్గరగా నొక్కాలి. కొన్ని సెకన్లు అలాగే ఉంచి, తర్వాత మరో కాలుతో ఇలాగే చేయాలి. ఈ ఆసనం పొత్తికడుపుపై ఒత్తిడి కలిగించి జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది. భుజంగాసనం వేయడం ద్వారా కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ఆసనం పొత్తికడుపును స్ట్రెచ్ చేసి జీర్ణ అవయవాలను ఉత్తేజితం చేస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా పొట్టపై పడుకోవాలి. తరువాత చేతులను భుజాల దగ్గర ఉంచాలి. మెల్లగా ఛాతీని పైకి లేపి, భుజాలను రిలాక్స్‌గా ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణను మెరుగుపరచి జీర్ణక్రియకు సహాయం చేస్తుంది.
అర్ధ మత్స్యేంద్రాసనం, పశ్చిమోత్తానాసనం..
అలాగే అర్ధ మత్స్యేంద్రాసనం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆసనం వెన్నెముకను మెలిపెడుతూ పొత్తికడుపు అవయవాలకు మసాజ్ లాంటిది ఇస్తుంది. ఈ ఆసనంలో ముందుగా కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. ఒక కాలును వంచి పాదాన్ని ఎదురుగా ఉన్న తొడ బయట ఉంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి మొండెంను వంగిన మోకాలి వైపుకు తిప్పాలి. ఈ ఆసనం జీర్ణ గ్రంథులను ఉత్తేజితం చేసి శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అదే విధంగా పశ్చిమోత్తానాసనం కూడా జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆసనం పొత్తికడుపుపై ఒత్తిడిని కలిగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా కాళ్లు చాపి కూర్చోవాలి. తరువాత నడుము భాగం నుండి ముందుకు వంగి పాదాలను తాకడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.
మలాసనం, ధనురాసనం..
ఇక మలాసనం అనేది లోతైన స్క్వాట్ ఆసనం, బౌల్ మూవ్‌మెంట్‌ను సహజంగా మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా కాళ్లు వెడల్పుగా ఉంచి స్క్వాట్‌లో కూర్చోవాలి. తరువాత చేతులను నమస్కారం ముద్రలో ఉంచాలి. తరువాత మోకాళ్లపై మోచేతులను ఉంచి నొక్కాలి. ఇది పెల్విక్ ప్రాంతంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన ప్రేగు పనితీరుకు తోడ్పడుతుంది. అదే విధంగా ధనురాసనం కూడా జీర్ణ అవయవాలను శక్తివంతంగా ఉత్తేజితం చేస్తుంది. ఈ ఆసనం వేయడానికి పొట్టపై పడుకోవాలి. మోకాళ్లు వంచి కాళ్లను చేతులతో పట్టుకోవాలి. అదే సమయంలో ఛాతీ, తొడలను పైకి లేపి ఉంచాలి. ఇది జీర్ణ గ్రంథులను ఉత్తేజితం చేసి గట్ యాక్టివిటీ పెంచుతుంది. ఈ విధంగా యోగాసనాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా పని చేస్తాయి. అయినప్పటికి ఈ ఆసనాలు వేస్తూనే సరైన ఆహారం తీసుకోవాలి. రోజూ తగినంత నీరు తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఖాళీ కడుపుతో, సరైన మార్గదర్శకత్వంలో యోగా చేయడం మంచిదని, నిరంతరం యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

