e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News జెరూసలేంలో అల్ జజీరా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్‌

జెరూసలేంలో అల్ జజీరా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్‌

జెరూసలేంలో అల్ జజీరా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్‌

జెరూసలేం : అల్ జ‌జీరా టీవీ ఛానల్‌కు చెందిన మహిళా కరస్పాండెంట్ గివారా బుడెరినిను ఇజ్రాయెల్ సరిహద్దు పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. జెరూసలేం సమీపంలోని యూదుల స్థావరాల నుంచి డజన్ల కొద్దీ పాలస్తీనా కుటుంబాలను తొలగించే అంశంపై ఆమె రిపోర్టింగ్ చేస్తుండ‌గా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్టు చేసిన చాలా సేప‌టి తర్వాత ఆమెను ఇజ్రాయెల్ సరిహద్దు పోలీసులు విడుదల చేశారు.

స‌రిహ‌ద్దులోని పాల‌స్తీనా స్థావ‌రంలో క‌వ‌రేజి కోసం వ‌చ్చిన గివారా బుడెరిని గుర్తింపు కార్డు చూపాల‌ని తొలుత ఇజ్రాయెల్ స‌రిహ‌ద్దు పోలీసులు అడిగారు. కారులో ఉన్న గుర్తింపు కార్డు కోసం డ్రైవ‌ర్‌కు ఫోన్ చేయాల‌ని ఆమె సూచించ‌గా, ఇజ్రాయెల్ పోలీసులు నిరాక‌రించారు. అనంత‌రం అమెను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. పోలీసులు తమ కెమెరామెన్ చేతిలోని కెమెరా, ఇతర పరికరాలను పగలగొట్టారని అల్ జ‌జీరా ఛానల్ పేర్కొన్న‌ది. జర్నలిస్ట్ గివారా బుడెరి చేయి విరిగిపోయిందని, జెరూసలేంలోని హడస్సా ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న‌ట్లు అల్ జజీరాకు జెరూసలేం బ్యూరో చీఫ్ వాలిద్ ఉమేరి తెలిపారు. షేక్ జరాహ్ నుంచి ఈ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్‌ క్రమం తప్పకుండా రిపోర్ట్ చేసేద‌ని ఉమేరి చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

WWDC 2021: రేప‌టి నుంచి ఆపిల్ ఈవెంట్ ప్రారంభం

ఇమ్రాన్ మాట : భార‌త్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే, కానీ..

ఆఫ్ఘాన్‌లో బాంబు పేలుడు : 11 మంది దుర్మ‌ర‌ణం

అదే స్వ‌రం : కొవిడ్‌కు చైనాదే బాధ్య‌త అన్న‌ ట్రంప్‌

భాషా వివాదం : ఈ ద‌వాఖాన‌లో మల‌యాళంలో మాట్లాడొద్దు..

చ‌రిత్ర‌లో ఈరోజు.. భాగ‌మ‌తి న‌దిలో రైలు దుర్ఘ‌ట‌న‌కు 40 ఏండ్లు

లినెథోల్మ్‌ ద్వీపం : స‌ముద్ర మ‌ట్టం పెరగ‌కుండా డెన్మార్క్ సృష్టి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జెరూసలేంలో అల్ జజీరా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement