ప్రభుత్వ అధికారిగా ఉండి తనపై ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తారా? అని రాష్ట్ర మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీరాం కర్రిపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ఫైర్ అయ్యా రు.
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ జర్నలిస్టునూ రేవంత్ సర్కారు వదలడం లేదు. ఎక్కడికక్కడే కేసులు నమోదు చేసి, అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అరెస్టు చేయిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి రెవెన్యూశాఖ నోటీసులు జారీచేసేందుకు వెళ్లిన సమయంలో కవరేజీకి వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుపై ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.