CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి రెవెన్యూశాఖ నోటీసులు జారీచేసేందుకు వెళ్లిన సమయంలో కవరేజీకి వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుపై ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇటీవల సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి ఘటన మరువకముందే సీఎం సోదరుడి ఇంటివద్ద అలాంటి ఘటనే ఎదురైంది.
మీడియా కవరేజీకి వచ్చిన ఓ మహిళా జర్నలిస్టును అడ్డుకోవడంతోపాటు, ఆమె కెమెరాను లాక్కోవడానికి తిరుపతిరెడ్డి అనుచరులు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. కాగా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అడ్డుకోవడం, మీడియాపై దాడి చేయడం కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రజాపాలన అని ప్రచా రం చేసుకుంటూ, మీడియా స్వేచ్ఛను హ రించడం సిగ్గుచేటని, మీడియా పై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ వేదికగా తెలిపారు.