హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అధికారిగా ఉండి తనపై ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తారా? అని రాష్ట్ర మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీరాం కర్రిపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ఫైర్ అయ్యా రు. ఓ మహిళా జర్నలిస్టు చేసిన ట్వీట్ ను శ్రీరాం కర్రి రీపోస్ట్ చేయడంతో శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. మహిళా జర్నలిస్టు ట్వీట్లో ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించేందుకు తమ తో పనిచేయాలని, ఇందుకు తాము ఫండింగ్ చేస్తామని కోరాననడం ఫేక్ ప్రచారమని దిలీప్ తెలిపా రు. శ్రీరాం కర్రిని ఉద్దేశిస్తూ.. ‘మీరు ఇంత కింది స్థాయికి దిగజారుతారని అనుకోలేదు. ప్రస్తుతం మీరు తెలంగాణ ప్రభుత్వం లో అధికారిగా కొనసాగుతున్నారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఏ ప్రభుత్వ ఉద్యోగికి తగ దు. అసమర్థ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తుంటే మీ బాస్(రేవంత్) తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. కాంగ్రెస్ ఐటీ సెల్‌కు పని చేయాలనుకుంటే వెంటనే మీ ఉద్యోగానికి రాజీనామా చేయాలి’ అని దిలీప్ ట్వీట్ చేశారు.