హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచరులుగా మారి మీడియాపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. టీఎస్ 24 న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడిని శుక్రవారం ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ‘మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉన్నది. మీడియా స్వేచ్ఛను అణగదొకేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నది. అధికార బలంతో పోలీసులను మీడియాపై ఉసిగొల్పడం గర్హనీయం. మహిళా జర్నలిస్టుపై అకసుతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం, సీసీ కెమెరా డాటాను స్వాధీనం చేసుకోవడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమే. ఇది రేవంత్‌రెడ్డి నిరంకుశ, నియంతృత్వ పాలనలో జర్నలిస్టులకు దకుతున్న గౌరవం. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్త్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు, పోస్టులు పెడితే భౌతికదాడులు! ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజాపాలన? ఇందిరమ్మ రాజ్యమని కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను గుర్తుచేస్తున్నారు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.