దామరచర్ల, మార్చి 12 : ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారు ఇటీవల హైదరాబాద్లో సెకండ్ లెవెల్ లో నిర్వహించిన మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలో దామరచర్ల మండల కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థిని సోమ శివాన్సిక తండ్రి భిక్షం రెడ్డి జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గాను నిన్న హైదరాబాద్లోని భారతీయ విద్యా భవన్లో ఐబిఆర్ ఫౌండర్ రామకృష్ణ, మిస్ ఇండియన్ సుహాసిని, చైల్డ్ సైకాలజిస్ట్ సిరి పూజ, నేషనల్ రైఫిల్స్ షూటర్ డాక్టర్ భువనేశ్వరి చేతుల మీదుగా ప్రశంస పత్రం, మెమొంటో అందుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యంను ఉత్తమ టీచర్ అవార్డుతో డైరెక్టర్ కంభంపాటి శ్రీనయ్యను నిర్వాహకులు సన్మానించారు. శివాన్షికను పాఠశాల డైరెక్టర్లు జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల అయ్యన్న కంభంపాటి శ్రీనయ్య, ప్రిన్సిపాల్ స్వయంపాకల హరిత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సునీత, షాయిని శ్రీలక్ష్మి, వనజ, అంజలి, డేవిడ్, సోనీ తేజశ్రీ, రమ్యలత, జానీ బేగం అభినందించారు.

మ్యాథ్స్ ఒలంపియాడ్లో సోమ శివాన్షిక ప్రతిభ