cop suspended | వీధి వ్యాపారుల నుంచి ఉచితంగా ఆహారం డిమాండ్.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్
cop suspended | ఒక పోలీస్ కానిస్టేబుల్ వీధి వ్యాపారుల నుంచి ఉచితంగా ఆహారం డిమాండ్ చేస్తున్నాడు. చిరుతిండ్లు, ఐస్‌క్రీం వంటివి తీసుకుని తినసాగాడు. వ్యాపార సంఘ సభ్యులు దీనిని వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతోపాటు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
లక్నో: ఒక పోలీస్ కానిస్టేబుల్ వీధి వ్యాపారుల నుంచి ఉచితంగా ఆహారం డిమాండ్ చేస్తున్నాడు. చిరుతిండ్లు, ఐస్‌క్రీం వంటివి తీసుకుని తినసాగాడు. వ్యాపార సంఘ సభ్యులు దీనిని వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతోపాటు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. (cop suspended) ఈ నేపథ్యంలో ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీస్ రెస్పాన్స్ వెహికల్ (పీఆర్వీ)కు చెందిన ఒక కానిస్టేబుల్ తరచుగా సమీపంలోని వీధి వ్యాపారుల నుంచి పానీపూరీ, ఐస్‌క్రీమ్ వంటివి డిమాండ్ చేసి ఉచితంగా తింటున్నాడు.
కాగా, ఆ కానిస్టేబుల్ తీరుపై స్థానిక వ్యాపారులు విసిగిపోయారు. ఉచితంగా చిరుతిండి తింటున్న వీడియోను వ్యాపారుల సంఘానికి చెందిన సభ్యులు రికార్డ్ చేశారు. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
అలాగే ఆ వీడియో క్లిప్‌ను పోలీస్ ఉన్నతాధికారికి షేర్ చేయడంతో పాటు ఆ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారి స్పందించారు. ఆ కానిస్టేబుల్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేశారు. నిజమని తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

