దేశంలో కొత్తగా 60వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 60వేల కరోనా కేసులు | దేశంలో కరోనా రోజు రోజుకు దిగి వస్తున్నది. మరో వైపు మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజు రోజుకు దిగి వస్తున్నది. మరో వైపు మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 97,743 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో వైపు 1,647 మరణాలు రికార్డయ్యాయని మంత్రిత్వశాఖ చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు పెరిగింది. ఇందులో 2,86,78,390 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,85,137 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 7,60,019 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 27,23,88,783 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.16 శాతానికి పెరిగిందని తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికంటే తక్కువగా ఉందని, ప్రస్తుతం 3.58శాతానికి చేరిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.98శాతానికి తగ్గిందని.. వరుసగా 12 రోజుల్లో ఐదు శాతానికి తక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 38.92 కోట్ల కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
అమర్నాథ్ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్ ఎల్జీ
కొడంగల్ శివారులో రెండు కార్ల ఢీ.. ఐదుగురు దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

