న్యూఢిల్లీ : గ్రామీణ భారతంలో విద్యాపరమైన మౌలిక సదుపాయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మంగళవారం ప్రకటించారు. ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని దీప్కే ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర హింగోలిలోని తన స్వగ్రమం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. స్వాతంత్య్రానంతరం గడచిన 80 సంవత్సరాల్లో దేశంలో అత్యంత అధికంగా నిర్లక్ష్యానికి గురైనది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడులేనని ఆయన చెప్పారు.