Ponguleti srinivas reddy | చిలిపిచెడ్, మే 17 : రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయక భూ భారతి చట్టాన్ని తప్పదోవ పట్టిస్తే ఏ స్థాయి అధికారైనా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, భూభారతి చట్టంలో రైతులకు భూ సమస్యలపై తహసీల్దార్, కలెక్టర్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవాళ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రమైన రైతు వేదికలో జిల్లాలోని భూ భారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన చిలిపిచెడ్ మండలంలో భూ భారతి చట్టం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలతో కలిపి భూ భారతి చట్టం ఏర్పాటు చేశామన్నారు. మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో అదే విధంగా భూదార్‌ను ఈ చట్టంలో పెట్టడం జరిగిందన్నారు. 2025 చట్టానికి ముందే 10956 వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థ ఉండేది. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఆ వ్యవస్థను రద్దు చేశారన్నారు. చిలిపిచెడ్ మండలంలో ఉన్న 16 రెవెన్యూ గ్రామాల్లో వేయి దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. భూ భారతి కోసం నాలుగు ఫైలట్ మండలాలు ఎంపిక చేస్తామన్నారు.
సాదాబైనామా కాకుండా మిగితా అంశాలు అన్నిటిని నాలుగు మండలాల్లో జూన్ 2 తేదీ వరకు పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 32 మండలాల్లో భూ భారతి చట్టం తీసుకవచ్చాం. దీని ద్వారా వచ్చిన ఫలితాలను ఆలోచించి జూన్ 2 తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. ఆగస్టు 15 నాటికి ఎక్కువ సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించాలని ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా చిలిపిచెడ్ మండలం..
పైలట్ ప్రాజెక్టుగా చిలిపిచెడ్ మండలం తీసుకోవడం చాలా సంతోషకరం అన్నారు. గౌతాపూర్ గన్య తండాల్లో 200 మంది రైతులకు పట్టాపాసుబుక్లు ఇస్తే వారికి రైతుబంధు వస్తుందని, అలాగే పట్టా పాసుబుక్‌లు లేకపోవడంతో ధాన్యం వారి పేరు మీద పోవడం లేదని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మెదక్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. శివ్వంపేట మండలంలో నవాబ్‌పేటకు సంబంధించిన గ్రామం మొత్తం 14 ఎకరాలు రెవెన్యూ ఫారెస్టు వల్ల ఒక్కరికి కూడా పట్టా సర్టిఫికెట్ ఇవ్వలేదని మంత్రికి తెలియజేశారు. చిలిపిచెడ్ మండలంకు తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్‌స్టేషన్, నర్సాపూర్‌లో ఆర్డీవో కార్యాలయం మంజూరు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.
నర్సాపూర్‌లో డబుల్ బెడ్ రూంలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని వాటికి నిధులు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి తీసుకెళ్లారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తెలిపారు. చిలిపిచెడ్ మండలంలో కొనసాగుతున్న అంతారం రెవెన్యూ గ్రామాన్ని కౌడిపల్లి మండలంలో కలపాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, జయచంద్ర రెడ్డి, తహసీసీల్దార్లు సహాదేమ్, ఆంజనేయులు, శ్రీనివాస్, ఎంపీడీవో ఆనంద్,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు