Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
Indiramma Houses | జీపీ కార్యదర్శి లంచం తీసుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు హనుమకొండ జిల్లాలోని వేలేరు మండలం గుండ్లసాగర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Indiramma Houses | వేలేరు : హనుమకొండ జిల్లాలోని వేలేరు మండలం గుండ్లసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల వ్యవహారం వివాదానికి దారి తీసింది. ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులకు ఇల్లు కేటాయించకుండా ఇతరులకు కేటాయిస్తున్నారని గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం నిరసన వ్యక్తం చేశారు.
జీపీ కార్యదర్శి రూ.50 వేలు లంచం తీసుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు తాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత సర్పంచ్ కావడంతో కొంత మంది రాజకీయ నాయకులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామ సర్పంచ్ మానస ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల విషయంలో నెలకొన్న వివాదం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూడాలని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లంచం ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Read Also :
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

