మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు బూర్గంపహాడ్ మండలంలో బీఆర్ఎస్ నేతలు ముమ్మరంగా చేపడుతున్నారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ గ్రామంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో...
బూర్గంపహాడ్, అక్టోబర్ 24 : ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు బూర్గంపహాడ్ మండలంలో బీఆర్ఎస్ నేతలు ముమ్మరంగా చేపడుతున్నారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ గ్రామంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్, పీహెచ్సీలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందిని కలిసి అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు చేయించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, అర్హులందరూ తమ ఓటును ఆన్లైన్లో నమోదు చేయించుకుని సహ ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
అదేవిధంగా పారిశ్రామికవాడ సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించి అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు నమోదు చేయించుకుని ఓటు వేసే విధానంలో కీలకం కావాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మోరంపల్లిబంజర్ ఉప సర్పంచ్ పొక్కుల రవి, మాజీ వార్డు సభ్యులు పద్మ, బీసీ సెల్ అధ్యక్షులు చేతుల పెద్దవీర్రాజు, మూల బాలిరెడ్డి, కురుకుంట్ల చిన్నప్పరెడ్డి, గంగుల చంద్రశేఖర్‌రెడ్డి, సారపాక యూత్ నాయకులు సోము లక్ష్మిచైతన్యరెడ్డి, చల్లకోటి పూర్ణ, చట్టు ఆంజనేయులు, దాసరి మోహన్, పంగి సురేష్, ఈశ్వర్ పాల్గొన్నారు.

మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

