Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
Delhi school : ఢిల్లీలోని స్కూల్లో ఒక బాలిక కాలిపోయిన స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. బాలిక ఎలా కాలిపోయిందనే విషయంలో, అలాగే అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Delhi school : ఢిల్లీలోని స్కూల్లో ఒక బాలిక కాలిపోయిన స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. బాలిక ఎలా కాలిపోయిందనే విషయంలో, అలాగే అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత బాలిక 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటన ఢిల్లీలోని కృష్ణా నగర్లో శనివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్లో బాలిక మృతిచెందడంపై కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం సమాచారం అందింది.
వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. స్కూల్లోని గార్డ్ రూం పక్కన, వాటర్ ట్యాంక్ సమీపంలో 18 ఏళ్ల వయసున్న, 12వ తరగతి చదువుతున్న బాలిక శరీరం కాలిపోయి ఉంది. అప్పటికే బాలిక మరణించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో బాలిక బ్యాగ్, కొన్ని వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు బాలిక ఎలా మరణించింది.. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరున్నారు.. స్కూల్ సిబ్బంది ఏం చేస్తున్నారు వంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై బాలిక సోదరి స్పందించింది. తానే ఉదయం తన చెల్లిని స్కూల్లో వదిలేశానని, ఉదయం నవ్వుతూనే స్కూల్‌కు వెళ్లిందని తెలిపింది. ఇంతలోపే ఏం జరిగిందో తెలియడం లేదని సోదరి విలపించింది. తన సోదరి ఎలా మరణించింది అనే విషయంపై స్పష్టత రావాలని కోరింది. బాలిక మృతిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందని, దీనిపై పోలీసులు, అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

