జనవరి 3న టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలు
తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఫెడరేషన్ రాష్ట్ర విసృ్తతస్థాయి సమావేశం తీర్మానించింది.
- రాష్ట్ర విసృ్తతస్థాయి సమావేశంలో తీర్మానం
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఫెడరేషన్ రాష్ట్ర విసృ్తతస్థాయి సమావేశం తీర్మానించింది. వచ్చే ఏడాది జనవరి 3న హైదరాబాద్‌లో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర తృతీయ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించింది.
టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విసృ్తతస్థాయి సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య గత కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాంచందర్, బసవపున్నయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఫెడరేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

