మెటాైపె దాడి అత్యంత విచారకరం
హైదరాబాద్‌లోని మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
- బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బతీయొద్దు
- వ్యాపారసంస్థల నమ్మకాన్ని కోల్పోవద్దు
- ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ అదివారం ఆయన ఈ ఘటనపై స్పందించారు. ‘ఇది హైదరాబాద్.. తెలంగాణకు అత్యంత విచారకరమైన రోజు’ అని పేర్కొన్న ఆయన..
భారీ పెట్టుబడులు పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యాపార సంస్థల విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయకూడదని హితవు పలికారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను, చట్టంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వెంటనే పునరుద్ధరించాలని మోహన్‌దాస్ పాయ్ సూచించారు. దయచేసి హైదరాబాద్‌కు ఉన్న మంచి పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు.
హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదు
ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మోహన్‌దాస్ పాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్వీట్‌ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, జైరాం రమేశ్, కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాతోపాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కూడా ట్యాగ్ చేశారు. రాజకీయ కారణాలతో అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలపై దాడులకు దిగడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అంతకుముందు ఇదే ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘బ్రాండ్ హైదరాబాద్ దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. దశాబ్దాల పాటు ఎంతో శ్రమించి, పరిశ్రమల అనుకూల విధానాలతో దీనిని నిర్మించాము’ అని కేటీఆర్ తన పోస్టులో పేరొన్నారు. యూత్ కాంగ్రెస్ నేతల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించారనే కారణంతో కార్యాలయంలోకి చొరబడి పూల కుండీలను ధ్వంసం చేయడం వంటి చర్యలు పెట్టుబడిదారులను భయబ్రాంతులకు గురిచేస్తాయని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

