‘ఇంటర్’ రద్దుతో స్థానికతకు ముప్పు
ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంతో విద్యార్థుల స్థానికతకు తీరని ముప్పు అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తొమ్మిది నుంచి పదో తరగతి వరకు ఒకే విద్యాలయంగా మారిస్తే తెలంగాణ విద్యార్థులకు ప్రమాదమేని పేర్కొన్నారు.
- తెలంగాణకు రాష్ట్ర సర్కార్ ద్రోహం
- నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలి
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంతో విద్యార్థుల స్థానికతకు తీరని ముప్పు అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తొమ్మిది నుంచి పదో తరగతి వరకు ఒకే విద్యాలయంగా మారిస్తే తెలంగాణ విద్యార్థులకు ప్రమాదమేని పేర్కొన్నారు. కోఠారి కమిషన్ సిఫార్సుల మేరకు పీవీ నర్సింహారావు తెచ్చిన ఇంటర్ వ్యవస్థను నాడు ఎన్టీఆర్ బలోపేతం చేస్తే.. నేడు రేవంత్‌రెడ్డి ఒక్క సంతకంతో కూల్చివేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ బోర్డు రద్దుపై ఇదేనెల 13న రాసిన మొదటి లేఖకు ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఎం రేవంత్‌కు రాసిన రెండో లేఖను ఈ సందర్భంగా ఆయన మీడియా ఎదుట విడుదల చేశారు.
విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరుపకుండా, మంత్రివర్గ తీర్మానం, అసెంబ్లీ ఆమోదంలేకుండా ఇంటర్‌విద్యను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దూరదృష్టితో వ్యవహరించి పీవీ నర్సింహారావు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, విద్యావేత్తలు, మేధావులతో చర్చించి ఇంటర్ విద్యావ్యవస్థను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వొకేషనల్ విద్యను జోడించి బలోపేతం చేశారని చెప్పారు. కానీ ఐదు దశాబ్దాలుగా నిర్మితమైన ఈ వ్యవస్థను అధ్యయనం లేకుండా తుగ్లక్ నిర్ణయంతో రద్దుచేయడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. 9 నుంచి 12 వరకు సీనియర్ సెకండరీ స్కూల్‌గా మారిస్తే తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన 85% మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు పరాయివారి పరమవుతాయని ఎండగట్టారు.
ఇదీ తెలంగాణకు జరిగే ముప్పు
‘రాజ్యాంగంలోని అర్టికల్ 371 (డీ), రాష్ట్రపతి ఉత్తర్వులు (1974), ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 95, జీవో 33, 15 ప్రకారం తెలంగాణలో 85 శాతం లోకల్ సీట్లకు అర్హత సాధించాలంటే నీట్/ఎప్‌సెట్ రాసే ముందు నాలుగేండ్లు ఇక్కడే చదవాల్సి ఉంటుంది.. ప్రస్తుతం ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులు వేర్వేరుగా ఉండటంతో ఏపీతో సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు పదో తరగతి వరకు సొంత రాష్ట్రాల్లో చదివి ఇంటర్ కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. వారు రెండేండ్లు ఇక్కడ చదివినా తెలంగాణ విద్యార్థులకే 85 శాతం సీట్లు దక్కు తున్నాయి. కానీ 9 నుంచి 12 తరగతులను ఒకే గొడుకు కిందకు తెస్తే నారాయణ, శ్రీచైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలు నాలుగేండ్ల రెసిడెన్షియల్ ప్యాకేజీ పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తాయి. తద్వారా మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం వస్తుంది’ అని దాసోజు శ్రవణ్‌కుమార్ ఆ లేఖలో వివరించారు.
విద్యా కమిషన్ నివేదిక బయటపెట్టరా?
సీఎం రేవంత్‌రెడ్డి నియమించిన ఆకునూరి మురళి విద్యా కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఎందుకు తొకిపెట్టారని దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. మురళి కమిషన్ నివేదికలో ఏమున్నదో ప్రజలకు చెప్పకుండా, కనీసం అడ్వకేట్ జనరల్ న్యాయసలహా తీసుకోకుండా నియంతలా వ్యవహరిస్తూ ఇంటర్ బోర్డును రద్దు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. రాజ్యాంగ హకుల గురించి నిరంతరం పాఠాలు చెప్పే ప్రొఫెసర్ ఎం కోదండరాం ఈ అంశంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని శ్రవణ్ సూటిగా నిలదీశారు. ఇంటర్ బోర్డును రద్దు చేయడాన్ని కోదండరాం సమర్థిస్తే అది రేవంత్‌రెడ్డికి బానిసత్వం చేసినట్టే అవుతుందని, తెలంగాణ విద్యావ్యవస్థకు జరుగుతున్న అన్యాయంపై కోదండరాం తప్పును తప్పు అని ధైర్యంగా చెప్పాలని హితవు పలికారు. విద్యావ్యవస్థపై కనీస అవగాహన లేని, హిట్లర్ తరహాలో ఫత్వాలు జారీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని విద్యాశాఖ మంత్రిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎలా కొనసాగిస్తారని దాసోజు శ్రవణ్‌కుమార్ నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

