Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
Arunachal Anti-Dam Protest | ప్రతిపాదిత డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి. ఎన్‌హెచ్‌పీసీ స్థానిక కార్యాలయంతో పాటు పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అలాగే ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు.
ఇటానగర్: ప్రతిపాదిత డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి. ఎన్‌హెచ్‌పీసీ స్థానిక కార్యాలయంతో పాటు పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అలాగే ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈస్ట్ సియాంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రతిపాదిత ‘అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ డ్యామ్’కు వ్యతిరేకంగా పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తీవ్రమయ్యాయి. నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న 10 మందిని విడుదల చేయాలని ఒక వర్గం డిమాండ్ చేసింది.
కాగా, శుక్రవారం అప్పర్ సియాంగ్‌లోని గెకులో నిరసనకారులు రాళ్ల దాడికి, నిప్పు పెట్టడానికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంద్ చేస్తున్న మద్దతుదారులపై భద్రతా సిబ్బంది బాష్పవాయువు ప్రయోగించారు. ఈ సంఘటనలో నలుగురు మహిళలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగింది.
పాసిఘాట్‌లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు ఎన్‌హెచ్‌పీసీ స్థానిక కార్యాలయానికి నిప్పుపెట్టారు. పాసిఘాట్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఏడు వాహనాలకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, ఓని పాన్యాంగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాలింగ్ మోయోంగ్ నివాసాలు, నివాస సముదాయాలపై నిరసనకారులు దాడులు చేసి విధ్వంసానికి పాల్పడ్డారు.
అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని, అలాగే ఆ ప్రాంతం నుంచి సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు శుక్రవారం పిలుపు ఇచ్చిన సమ్మె పలు చోట్ల హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో అదనపు భద్రతా దళాలను తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

