కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి చాడ కిషన్‌రెడ్డి విమర్శించారు. టేకులపల్లి మండల కేంద్రంలో...
టేకులపల్లి, అక్టోబర్ 24 : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి చాడ కిషన్‌రెడ్డి విమర్శించారు. టేకులపల్లి మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్‌తో కలిసి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎల్‌నినో ప్రభావంపై గత ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల నుండి నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలను నింపాలని కేటీఆర్, హరీశ్‌రావు పలుమార్లు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణమే కార్యాచరణ రూపొందించి, సాగునీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు.
ఓటరు నమోదు, పార్టీ సభ్యత్వాల పెంపుపై ప్రత్యేక దృష్టి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు, పార్టీ సభ్యత్వాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పట్టభద్రులను కలిసి ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నామని, కళాశాలలు, గ్రామాలు, పట్టణాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 12 వేల సభ్యత్వాలు సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు, భూక్యా దళ్‌సింగ్ నాయక్, రాంపురం సర్పంచ్ బర్మావత్ శివకృష్ణ, బానోతు నరేష్, మహిళా నాయకురాలు ఆమేడ రేణుక, భానోత్ రామా నాయక్, భూక్యా లాలు, మాలోత్ పుల్సింగ్, నాగభూషణం, కామేపల్లి మండల నాయకులు అంతోటి అచ్చయ్య, మూడ్ కృష్ణ ప్రసాద్, మల్లంపాటి శ్రీనివాస్, సామా మోహన్‌రెడ్డి, కాటాల రాంబాబు, ఉద్యమకారులు దేవిలాల్, ఎస్.కే. నాగుల్‌మీరా, గుంపెనపల్లి అనంత రాములు, ఈసం రామ్మూర్తి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

