Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Sonia Gandhi: రాజీవ్ గాంధీతో జరిగిన లవ్ జర్నీ గురించి సోనియా ఆసక్తికర విషయాలు చెప్పారు. కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఉన్న గ్రీకు రెస్టారెంట్లో తొలిసారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు చెప్పారు. ఇవాళ ఎక్స్ అకౌంట్లో ఖాతా ఓపెన్ చేసిన సోనియా.. దాంట్లో ఓ వీడియో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాజీవ్ గాంధీ, సోనియా(Sonai Gandhi) చదువుకున్నారు. ఆ వర్సిటీలో ఉన్న గ్రీక్ రెస్టారెంట్లో రాజీవ్ గాంధీతో తన ప్రేమ ప్రయాణం మొదలైనట్లు సోనియా గాంధీ తెలిపారు. రాజీవ్ గాంధీతో జరిగిన తన తొలి పరిచయం గురించి ఆమె తన ఎక్స్ అకౌంట్లో చెప్పారు. ఇవాళ కొత్తగా సోనియా తన ఎక్స్ అకౌంట్‌ను ఓపెన్ చేశారు. దాంట్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఇక తన ఆత్మకథ బిలాంగింగ్ బుక్ గురించి చెబుతూ.. నవంబర్ 10వ తేదీన ఆ పుస్తకం ఆవిష్కరణ కాబోతుందన్నారు. రాజీవ్ గాంధీతో జరిగిన ప్రేమ ప్రయాణం గురించి ఆ బుక్‌లో రాసినట్లు ఆమె చెప్పారు.
విద్యార్థులుగా ఉన్న సమయంలో రాజీవ్‌తో కలిసి దిగిన ఫోటోలను కూడా సోనియా ఆ బుక్‌లో షేర్ చేశారు. ఆ రోజుల్లో ఇంగ్లండ్‌లో ఫుడ్ బాగుండేది కాదు అని, అందుకే తాను ఇటాలియన్ ఫుడ్ కోసం గ్రీకు రెస్టారెంట్‌కు వెళ్లినట్లు చెప్పారు. యురోపియన్ స్టూడెంట్స్‌తో పాటు ఇండియన్ విద్యార్థులు కూడా ఆ రెస్టారెంట్‌కు వచ్చేవారన్నారు. ఆ రెస్టారెంట్లోనే రాజీవ్ గాంధీ తనకు పరిచయం అయినట్లు సోనియా తెలిపారు. రాజీవ్‌ను చూడగానే తన జీవితభాగస్వామి దొరికినట్లు భావించానన్నారు. రాజీవ్‌కు కూడా తన పట్ల అదే అభిప్రాయం కలిగిందన్నారు.
మొదటిసారి ఓ కామన్ ఫ్రెండ్ తమను పరిచయం చేశారన్నారు. ఆ తర్వాత మేం స్నేహితులమయ్యామని, ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లేవాళ్లమని, స్టూడెంట్స్‌తో కలిసి ఓసారి వాలెంటైన్ పార్టీకి కూడా వెళ్లినట్లు చెప్పారు. రాజీవ్ గాంధీ సున్నిత మనసుతత్వం తనను ఆకర్షించినట్లు సోనియా తెలిపారు. సోనియా, రాజీవ్ గాంధీ 1968 ఫిబ్రవరి 25వ తేదీన పెళ్లి చేసుకున్నారు. గురువారమే సోనియా ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.
In a small Greek restaurant in Cambridge my journey of love began.
Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you. https://t.co/zvN5Rqqstf
— Sonia Gandhi (@SoniaGandhi) October 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

