పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర, శాంతిభద్రతల పరిరక్షణలో...
అనంతగిరి, అక్టోబర్ 24 : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అందిస్తున్న సేవల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ శాఖలో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ పరికరాలు, నేర పరిశోధనకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పోలీసింగ్ విధానాల గురించి స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు వివరించారు.
ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు వారి ధైర్యసాహసాలను విద్యార్థులకు వివరించి. సమాజంలో శాంతి, భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమైనదో వారికి తెలియజేశారు. విద్యార్థులు చట్టాలను గౌరవించాలని, క్రమశిక్షణతో మెలగాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లింగారెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

