బీబీనగర్, అక్టోబర్ 21 : బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత వసతి గృహాల ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం బీబీనగర్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, అదేవిధంగా భువనగిరిలోని ఎస్సీ ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ఎస్టీ ఇంటర్, డిగ్రీ బాలికల వసతి గృహాలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వసతి గృహాల్లోనీ వంట గదులను పరిశీలించి కూరగాయలతో పాటు వంటకు ఉపయోగించే వస్తువుల నాణ్యతను పరిశీలించారు. వసతి గృహాల్లో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికల వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి సమస్యలున్నా పై అధికారులకు నివేదికను అందించి వెంటనే సమస్యలను పరిశీలించుకోవాలని వసతి గృహాల ఉపాధ్యాయులు, నిర్వాహకులకు, వంట వండే సిబ్బందికి సూచించారు.
Bibinagar : వసతి గృహాల్లో విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా చూడాలి : వి.మాధవిలత