రామగిరి, నవంబర్ 12 : నల్లగొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడ విద్యార్థిని లుబానా తన్వీర్ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికైంది. ఎస్జీఎఫ్ అండర్-17లో జిల్లా స్థాయిలో అద్భుత ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్ధినిని బుధవారం పాఠశాలలో హెచ్ఎం కె.రామకృష్ణ, పీడీ టోమ్మసాల గిరిబాబు ఘనంగా సన్మానించి జ్ఞాపిక, మెడల్ అందజేసి అభినందించారు. విద్యార్థిని త్వరలో జగిత్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది.