బెంగళూరు: ఫ్లైఓవర్ పిల్లర్ మధ్యలో ఖాళీ ఉన్న చోట ఒక వ్యక్తి నిద్రించాడు. రోడ్డున వెళ్లే వాహనదారులు, జనం అతడ్ని చూసి షాకయ్యారు. (Man Sleeping Inside Flyover Pillar) ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరుకున్నాడో తెలియక అయోమయంలో పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జలహళ్లి క్రాస్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ స్తంభంపై ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు, జనం ఇది చూశారు. కొందరు వ్యక్తులు అక్కడ గుమిగూడారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తిని కిందకు దించేందుకు ప్రయత్నించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఫ్లైఓవర్ పిల్లర్ పైకి ఆ వ్యక్తి ఎలా చేరుకున్నాడో అన్నది ఎవరికీ అంతుపట్టలేదు. ప్రమాదకరంగా ఉన్న అక్కడకు అతడు చేరుకోవడాన్ని కొందరు విమర్శించారు. అయితే ఆ వ్యక్తి నిరాశ్రయుడై ఉంటాడని, అందుకే అక్కడ తలదాచుకుంటున్నట్లు కొందరు, వర్కర్ కావచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.
Desperation or Neglect? Man Found Sleeping Inside Flyover Pillar at Jalahalli Cross Highlights Harsh Reality of Urban Poverty
A shocking incident was reported from Jalahalli Cross, where a man was found sleeping inside a hollow section of a flyover pillar. The bizarre sight… pic.twitter.com/s6EWWLnqcO
— Karnataka Portfolio (@karnatakaportf) November 11, 2025
Also Read:
Delhi bomber owned 2nd car | ఢిల్లీ మానవ బాంబర్‌కు రెండో కారు.. ఎకోస్పోర్ట్ కోసం పోలీసులు గాలింపు
Watch: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితులను డ్రోన్‌తో వెంబడించిన కెమెరామెన్