న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు తర్వాత అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అదృశ్యమయ్యాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆ వైద్యుడు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఉద్యోగం నుంచి అతడ్ని తొలగించింది. (Al-Falah’s Doctor Missing) జమ్ముకశ్మీర్‌కు చెందిన డాక్టర్ నిసార్ ఉల్ హసన్, హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివాడు. శ్రీనగర్‌లోని ఎస్ఎంహెచ్ఎస్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
కాగా, డాక్టర్ హసన్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2023లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ నుంచి అతడ్ని తొలగించింది.
మరోవైపు సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికిపైగా మరణించారు. ఈ భారీ పేలుడు ఘటన తర్వాత కశ్మీర్‌కు చెందిన డాక్టర్ హసన్ అదృశ్యమయ్యాడు.
కాగా, అల్-ఫలాహ్ యూనివర్సిటీతో ఆ డాక్టర్‌కు సంబంధం ఉన్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పేలుడుతో డాక్టర్ హసన్‌కు ఏమైనా సంబంధం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. మిస్సింగ్ అయిన అతడి కోసం పోలీసులు వెతుకున్నారు.
Also Read:
Delhi bomber owned 2nd car | ఢిల్లీ మానవ బాంబర్‌కు రెండో కారు.. ఎకోస్పోర్ట్ కోసం పోలీసులు గాలింపు
Red Fort Blast | ఢిల్లీ పేలుడు అనుమానితులు.. మరో రెండు కార్లు కొనుగోలు?
Watch: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితులను డ్రోన్‌తో వెంబడించిన కెమెరామెన్
Watch: రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం చేసిన వ్యక్తి