న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు అనుమానితులు మరో రెండు కార్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (Red Fort Blast) అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు, అతడి ముఖ్య సహచరుడు కలిసి పేలుడుకు వినియోగించిన ఐ20 కారుతో పాటు ఢిల్లీ నుంచి మరో రెండు కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
కాగా, సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలోని మెట్రోస్టేషన్ గేట్ 1 వద్ద పార్క్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 9 మంది మరణించగా 20 మందికిపైగా గాయపడ్డారు. అనుమానిత మానవ బాంబు ఉమర్ నబీ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలున్న వైద్యుడిగా గుర్తించారు.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని విద్యుత్ శాఖలో పనిచేసిన అమీర్ రషీద్ మీర్, అతడి కుటుంబం ఉమర్‌కు సహాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అమీర్‌తో పాటు ప్లంబర్‌గా పనిచేసే అతడి సోదరుడు ఉమర్ రషీద్, మరో అనుమానితుడు తారిక్ మాలిక్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారి ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, కాల్ డాటా, వాట్సాప్, టెలిగ్రామ్, ప్రయాణ చరిత్రను కూడా పరిశీలిస్తున్నారు.
Also Read:
Delhi blast | ఢిల్లీ పేలుడు నిందితులతో మాకు సంబంధం లేదు : అల్ ఫలా యూనివర్సిటీ
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. వెలుగులోకి మరో వీడియో
Watch: రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం చేసిన వ్యక్తి