Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు (Delhi Blast) ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట (Red Fort) క్రాసింగ్ వద్ద ఉన్న సిగ్నల్‌లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు సిగ్నల్ వద్ద ఉన్న నిఘా కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పేలుడు ఘటనతో అక్కడున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయి.
VIDEO | CCTV footage captures the exact moment of the blast near Delhi’s Red Fort.
A blast took place in a slow-moving car at a traffic signal near the Red Fort metro station on Monday evening, killing 12 people, injuring many and gutting several vehicles.
(Source: Third Party)… pic.twitter.com/xjpScNpJ5Y
— Press Trust of India (@PTI_News) November 12, 2025
మరోవైపు పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. పేలుడుకు ముందు దుండగులు పలుమార్లు ఎర్రకోట (Red Fort) వద్ద రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున ఎర్రకోట వద్ద పేలుళ్లకు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జాతినుద్దేశించి ప్రసంగించనున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఇటీవలే ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. అనేకమంది వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వారితో సంబంధం ఉన్న ఉమర్.. తాను కూడా దొరికిపోతానన్న భయంతోనే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Delhi Blast | పేలుడుకు ముందు.. కన్నౌట్ ప్లేస్, మయూర్ విహార్‌లో సంచరించిన ఐ20 కారు