Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఘటనకు ముందు పేలుడుకు ఉపయోగించిన వైట్కలర్ ఐ20 కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సీసీటీవీ ఫుటేజుల ద్వారా సేకరిస్తున్నారు.
HR 26CE7674 నంబర్ ప్లేట్తో ఉన్న ఈ కారు నవంబరు 10న ఉదయం హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్లో కన్పించినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీలోకి ఎంటర్ అయ్యింది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలైన కన్నౌట్ ప్లేస్, మయూర్ విహార్లో సంచరించినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 3:19 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో పార్కింగ్ లాట్లోకి ఎంటర్ అయ్యింది. దాదాపు మూడు గంటల పాటూ అంటే సాయంత్రం 6:22 గంటల వరకూ అక్కడే ఉంది. ఆ తర్వాత ఉమర్ కారు నడుపుతూ వెళ్లాడు. ఎర్రకోట సమీపంలోని సిగ్నల్ వద్ద కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, 3.19 నుంచి 6.22 గంటల సమయంలో ఎలాంటి కదలికలు చోటుచేసుకున్నాయి, అతని వాహనం పార్కింగ్ చేసిన రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ప్రదేశంలో వాహనంలో ఎలా పేలుడు సంభవించిందన్న విషయంపై అధికారులు దృష్టి సారించారు. అతడు వాహనం వద్దే ఉన్నాడా, ఎవరినైనా కలుసుకున్నాడా..? లేక ఆ ప్రాంతాల్లో పరిశీలన జరిపాడా..? పేలుడుకు ముందు అక్కడ జనసందోహం ఏర్పడటం కోసం వేచి చూశాడా అన్నది కూడా పరిశీలిస్తున్నారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు..!