Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకూ 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 17 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి.
దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా మరో కీలక విషయం వెలువడింది. పేలుడుకు మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను (military grade explosives) ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రత, ప్రభావాన్ని బట్టి ఈ మేరకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తెలియనున్నాయి.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన ఢిల్లీ పోలీసులు, ప్రధాన భద్రతా, నిఘా వర్గాల వైఫల్యాలను స్పష్టంచేస్తున్నది. ఇటీవల జమ్ముకశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు సంయుక్త బృందం ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, పేలుడును అంచనా వేయడంలో ఘోరంగా విఫలం కావడం విమర్శలకు దారితీస్తున్నది. అంత మందుగుండు సామగ్రితో కూడిన కారు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించి, మూడు గంటల పాటు అక్కడ ఎలా ఉందో ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ కారు పేలుడులో కీలక సూత్రధారులు ఐదుగురు వైద్యులే!
Delhi Blast | డాక్టర్లను ఉగ్రవాదులుగా మార్చిన మౌల్వీ.. ఢిల్లీ పేలుడు మాస్టర్ మైండ్ అతనేనా?