Ashwini Sri | కుక్కను వాకింగ్‌కు తీసుకెళుతూ ప్రమాదం.. గాయాలతో వీడియో షేర్ చేసిన అశ్విని శ్రీ
Ashwini Sri | బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి అశ్విని శ్రీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఉదయం తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కిందపడిపోయి ముఖానికి గాయాలయ్యాయని ఆమె వెల్లడించారు.
Ashwini Sri | బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి అశ్విని శ్రీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఉదయం తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కిందపడిపోయి ముఖానికి గాయాలయ్యాయని ఆమె వెల్లడించారు. అశ్విని శ్రీ షేర్ చేసిన వీడియోలో ఆమె ముఖంపై గాయాలున్నట్లు కనిపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉదయాన్నే నా కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తుండగా అనుకోకుండా జారి కింద పడ్డాను. ముఖానికి బలంగా దెబ్బ తగిలింది. ఇలా మీ ముందుకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. గాయాల వల్ల చాలా నొప్పిగా ఉంది. మీరందరూ నా కోసం ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, సన్నిహితులు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. అలాగే బిగ్ బాస్ షోలో పాల్గొన్న పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన అశ్విని శ్రీ కెరీర్ ప్రారంభంలో పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. తరువాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన అందం, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. షో విజేతగా నిలవకపోయినా మంచి ఫాలోయింగ్ సంపాదించింది.
సినిమాలతో పాటు టెలివిజన్ షోలు, మ్యూజిక్ వీడియోలలో కూడా ఆమె కనిపిస్తోంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘రాజా ది గ్రేట్’, ‘బీటెక్ బాబులు’, ‘అమీర్‌పేటలో’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉండటంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Accident
- ashwini sri
- bigg boss
- Dog
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

