లక్నో: ఒక వ్యక్తి రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఇంటి గోడకు రంధ్రం పెట్టేందుకు తొలుత డ్రిల్ మెషిన్ ఉపయోగించాడు. ఆ తర్వాత పెన్సిల్‌తో ప్రయత్నించగా సులువుగా హోల్ పడింది. (Flat’s Wall Hole With Pencil) దీంతో ఆ గోడ నాణ్యతపై అతడు ఆశ్చర్యపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.
కబీర్ అనే వ్యక్తి తన రూ.1.5 కోట్ల ఫ్లాట్ గోడకు రంధ్రం చేసేందుకు ప్రయత్నించాడు. డ్రిల్ అవసరం లేకపోగా పెన్సిల్‌తోనే ఆ పని సులువుగా అయ్యింది. చెక్క పెన్సిల్‌ను సుత్తితో కొట్టగా అది గోడలోకి దిగిపోయింది. కోట్ల విలువైన ఇల్లు నాసిరకంగా నిర్మించినట్లు అతడు ఆరోపించాడు. గోడలు చాలా బలహీనంగా ఉన్నాయని విమర్శించాడు. ‘డ్రిల్ కూడా అవసరం లేదు. స్కూల్లో వినియోగించే పెన్సిల్తోనూ గోడకు రంధ్రం చేయవచ్చు’ అని ఎద్దేవా చేశాడు.
కాగా, ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆన్లైన్లో చర్చకు దారితీసింది. పలువురు భిన్నంగా స్పందించారు. ఆ బిల్డింగ్ నిర్మాణం, నాణ్యతపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే హైరైజ్ బిల్డింగ్స్ గోడలను ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ (ఏఏసీ)తో నిర్మిస్తారని కొందరు తెలిపారు. తేలికగా ఉండే ఈ గోడలు బిల్డింగ్ బరువును తగ్గిస్తాయని, భూకంపాల సమయంలో సురక్షితమని మరికొందరు వివరించారు.
Also Read:
Watch: రైలు కోచ్‌లో స్నానం చేస్తూ యువకుడు రీల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Watch: కదులుతున్న రైలు నుంచి చెత్త పడేసిన సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: కదులుతున్న కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు.. వీడియో వైరల్