న్యూఢిల్లీ: ఒక రైల్వే అటెండెంట్ కదులుతున్న రైలు నుంచి చెత్తను పడేశాడు. (Attendant Throws Trash From Moving Train) ఒక ప్రయాణికుడు దీనిని రికార్డ్ చేశాడు. రైల్వేకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవంబర్ 4న సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని కోచ్ అటెండెంట్ డస్ట్‌బిన్ నుంచి చెత్త కవర్ బయటకు తీశాడు. కదులుతున్న రైలు నుంచి దానిని బయటకు పడేశాడు.
కాగా, ఆ కోచ్‌లో ప్రయాణించిన అభిషేక్ సింగ్ దీనిని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. చెత్తను రైలు నుంచి బయటకు పడేయడంపై కోచ్ అటెండెంట్‌ను నిలదీశాడు. అయితే ఆ చెత్తను తాను ఇంటికి తీసుకెళ్లాలా? అంటూ అతడు దురుసుగా అన్నాడు. ఈ నేపథ్యంలో ప్రయాణికుడు అభిషేక్ సింగ్ ఈ సంఘటనపై రైల్వేకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో అతడు షేర్ చేయగా వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ ఫిర్యాదుపై రైల్వే స్పందించింది. కదులుతున్న రైలు నుంచి చెత్తను బయటకు పడేసిన కోచ్ అటెండెంట్‌ను సంజయ్ సింగ్‌గా గుర్తించినట్లు తెలిపింది. ఆ కాంట్రాక్ట్ సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. సంబంధిత కాంట్రాక్ట్ సంస్థకు జరిమానా విధిస్తామని వివరించింది. మరోసారి ఇలా జరుగకుండా ఆ కాంట్రాక్ట్ సంస్థను హెచ్చరిస్తామని పేర్కొంది.
Picked trash from the bin inside of the train, packed it and threw outside of the train.
Work done.🙂
Welcome to the Indian Railways.pic.twitter.com/neDu6aBp20
— Tarun Gautam (@TARUNspeakss) November 8, 2025
Also Read:
Students Shoot Classmate | క్లాస్‌మేట్‌ను ఇంటికి రప్పించి.. ఇద్దరు విద్యార్థులు కాల్పులు
Scooter Fined ‘Rs 21 Lakh | హెల్మెట్ ధరించనందుకు.. రూ.21 లక్షల జరిమానా
Watch: బెంగళూరు జైలులో ఇదీ పరిస్థితి.. ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూస్తున్న రేపిస్టులు, నేరస్తులు