చండీగఢ్: ఒక విద్యార్థి తన క్లాస్‌మేట్‌ను ఇంటికి రప్పించాడు. మరో స్టూడెంట్‌తో కలిసి పిస్టల్‌తో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిందితులైన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (Students Shoot Classmate) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 48లోని విలాసవంతమైన హౌసింగ్ సొసైటీ అయిన సెంట్రల్ పార్క్ రిసార్ట్స్‌లో నివసిస్తున్న కుటుంబాలకు చెందిన కొందరు విద్యార్థులు స్థానిక ప్రైవేట్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నారు.
కాగా, శనివారం రాత్రి 17 ఏళ్ల క్లాస్‌మేట్‌ను ఒక విద్యార్థి తన ఇంటికి బలవంతంగా రప్పించాడు. అక్కడ మరో స్టూడెంట్ కూడా ఉన్నాడు. గతంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో తండ్రికి చెందిన లైసెన్స్ పిస్టల్‌తో క్లాస్‌మేట్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడ్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. కాల్పులకు వినియోగించిన పిస్టల్, ఒక మ్యాగజైన్, ఐదు లైవ్ కార్ట్రిడ్జ్లు, ఒక ఖాళీ షెల్, 65 లైవ్ కార్ట్రిడ్జ్‌లతో కూడిన మరో మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు.
కాగా, నిందితులైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తోటి విద్యార్థిపై కాల్పులు జరిపిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. లైసెన్స్ ఆయుధాలు పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్త వహించాలని పేరెంట్స్‌కు సూచించారు.
Also Read:
mock slips dumped in Bihar | బీహార్‌లో పోల్ స్లిప్స్ రోడ్డుపై పారవేత.. ఎన్నికల అధికారి సస్పెండ్
Scooter Fined ‘Rs 21 Lakh | హెల్మెట్ ధరించనందుకు.. రూ.21 లక్షల జరిమానా
Watch: బెంగళూరు జైలులో ఇదీ పరిస్థితి.. ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూస్తున్న రేపిస్టులు, నేరస్తులు