లక్నో: రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటకు వంగి విన్యాసాలు, అసభ్యకర చేష్టలు చేసింది. (Nude Woman Stunt On Moving Car) వెనుక ఉన్న వాహనం డ్యాష్ బోర్డ్ కెమెరాలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రాత్రి వేళ షాహీద్ పాత్ రోడ్డుపై బ్లాక్ కారు వెళ్తున్నది. నగ్నంగా ఉన్న మహిళ ఆ కారు విండో నుంచి బయటకు వంగింది. ప్రమాదకరంగా విన్యాసాలు, అసభ్యకర చేష్టలు చేసింది.
కాగా, ఆ కారు వెనుక ఉన్న మరో కారు డ్యాష్ బోర్డుపై ఉన్న కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది.
‘యూపీ ఖబర్’ అనే ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో లక్నోలో ఈ తరహా సంఘటనలు జరుగుతుండటంపై ఆందోళన రేకెత్తించింది. ఈ వీడియో క్లిప్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Parents Kill Daughter | అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. కుమార్తెను చంపిన తల్లిదండ్రులు
Watch: కదులుతున్న రైలు నుంచి చెత్త పడేసిన సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?