లక్నో: తమ కుమార్తె అబ్బాయిలతో మాట్లాడటంపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహించారు. మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చారు. ఒక చోటకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు బాలిక పేరెంట్స్‌ను అరెస్ట్ చేశారు. (Parents Kill Daughter) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంతి గ్రామానికి చెందిన 15 ఏళ్ల సరిత హత్యకు గురైంది. నవంబర్ 5న రాత్రి వేళ గ్రామంలోని పొదల వద్ద ఆమె మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. గొంతుకోసి సరితను హత్య చేసినట్లు గ్రహించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, సరిత తండ్రి రమేష్ తొలుత పోలీసులను తప్పుదారి పట్టించాడు. ఆ తర్వాత నిజాన్ని ఒప్పుకున్నాడు. గ్రామంలోని అనేక మంది అబ్బాయిలతో సంబంధాలు కలిగి ఉండటంతో కుమార్తెపై ఆగ్రహించినట్లు తెలిపాడు. నవంబర్ 5న రాత్రి వేళ సరితకు తల్లి మత్తుమందు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఇంటికి దూరంగా కుమార్తెను తీసుకెళ్లి చంపినట్లు పోలీసులకు వెల్లడించాడు.
మరోవైపు పదునైన కత్తితో సరిత గొంతుకోసి హత్య చేసినట్లు తండ్రి రమేష్ అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు. ఇది పరువు హత్య కేసు అని ఆయన అన్నారు. తల్లిదండ్రులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Students Shoot Classmate | క్లాస్‌మేట్‌ను ఇంటికి రప్పించి.. ఇద్దరు విద్యార్థులు కాల్పులు
Watch: కదులుతున్న రైలు నుంచి చెత్త పడేసిన సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?