చెన్నై: తన భార్య, ఆమె లెస్బియన్ భాగస్వామి కలిసి తన కుమారుడైన పసిబిడ్డను చంపారని ఒక వ్యక్తి ఆరోపించాడు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ ఫోన్లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆధారాలు అందజేశాడు. ఈ నేపథ్యంలో మహిళ, ఆమె లెస్బియన్ పార్టనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (woman, lesbian partner arrested) తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిన్నాతి గ్రామానికి చెందిన 38 ఏళ్ల సురేష్, 26 ఏళ్ల భారతి భార్యాభర్తలు. అతడు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. నాలుగు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు వారికి ఉన్నారు. ఐదు నెలల కిందట మగబిడ్డను భారతి ప్రసవించింది.
కాగా, నవంబర్ 5న పసిబాబుకు పాలు పడుతుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు భారతి ఆరోపించింది. కేలమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ శిశువు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పసిబిడ్డ మృతదేహాన్ని ఖననం చేశారు.
మరోవైపు తన కుమారుడ్ని భార్య హత్య చేసినట్లు సురేష్ అనుమానించాడు. ఆమె మొబైల్ ఫోన్ పరిశీలించాడు. దీంతో భారతి, సుమిత్ర మధ్య ఉన్న అసహజ లైంగిక సంబంధం గురించి బయటపడింది. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వాయిస్ మెసేజ్‌లను సురేష్ పరిశీలించాడు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న బిడ్డను చంపినట్లు సుమిత్రతో భారతి చెప్పిన వాయిస్ మెసేజ్ అందులో ఉన్నది.
కాగా, భార్య భారతి, ఆమె లెస్బియన్ భాగస్వామి సుమిత్ర కలిసి తన కుమారుడ్ని హత్య చేసినట్లు సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య మొబైల్ ఫోన్లో ఉన్న ఆధారాలను అందజేశాడు. దీంతో పోలీసులు వాటిని పరిశీలించారు. భారతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు బాబు పుట్టిన తర్వాత సుమిత్ర, తాను ఎక్కువ సమయం గడపలేకపోతున్నట్లు భారతి చెప్పింది. అందుకే కుమారుడ్ని చంపినట్లు ఆమె అంగీకరించిందని పోలీస్ అధికారి తెలిపారు. వారిద్దరి మధ్య మూడేళ్లుగా అసహజ లైంగిక సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు. భారతి, సుమిత్రను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Students Shoot Classmate | క్లాస్‌మేట్‌ను ఇంటికి రప్పించి.. ఇద్దరు విద్యార్థులు కాల్పులు
Scooter Fined ‘Rs 21 Lakh | హెల్మెట్ ధరించనందుకు.. రూ.21 లక్షల జరిమానా
Watch: కదులుతున్న రైలు నుంచి చెత్త పడేసిన సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?